Crime News: కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శుక్రవారం చోటుచేసుకున్న ఘటన ప్రాంతంలో కలకలం రేపింది. ఒక మైనర్ బాలిక (16) మరియు వివాహితుడైన వ్యక్తి (35) ప్రైవేట్ లాడ్జ్‌లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా, ఆసుపత్రికి తరలించేలోపే ఇద్దరూ మృతి చెందారు.
అశ్వాపురం మండలానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరు మండలం రావిగూడెం గ్రామానికి చెందిన రవితో (35) గత కొంతకాలంగా ప్రేమ సంబంధం కొనసాగించింది. రవికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ ఈ సంబంధాన్ని కొనసాగించడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి.
మునుపే బాలిక తల్లిదండ్రులు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రవిని అరెస్ట్ చేశారు. రెండు నెలలు జైలులో గడిపిన అతడు బయటకు వచ్చాక కూడా తన తీరు మార్చుకోలేదు.
ఇది కూడా చదవండి: Medak: ప్రేమ వివాహానికి అంగీకరించలేదని యువతి ఆత్మహత్య
గురువారం రాత్రి రవి, బాలికతో కలిసి భద్రాచలంలోని భాగ్యలక్ష్మి లాడ్జ్‌లో గది తీసుకున్నాడు. రెండు రోజులు గడిపిన తర్వాత వారు పురుగుమందు తాగి ప్రాణాలను తీసుకునే ప్రయత్నం చేశారు. లాడ్జ్ సిబ్బంది గమనించి వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే రవిని మార్గమధ్యంలోనే మృతి చెందగా, బాలిక ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించింది.
భద్రాచలం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సమాజంలో మైనర్ల రక్షణ, వివాహేతర సంబంధాలపై చర్చకు తావు కల్పిస్తోంది.