Traffic Restrictions: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఆర్కే బీచ్ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో జూన్ 21 వరకు బీచ్ రోడ్ పూర్తిగా మూసివేయనున్నట్లు విశాఖ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నేవల్ కోస్ట్ నుంచి పార్క్ హోటల్ వరకు “రెడ్ జోన్” గా ప్రకటించారు. భద్రత పరంగా పలు నియమాలు అమలులోకి వచ్చాయి.
ముఖ్యమైన ఆంక్షలు ఇవే:
-
జూన్ 21 వరకు ఆర్కే బీచ్ రోడ్ మూసివేత
-
రెడ్ జోన్ పరిధిలో 5 కిలోమీటర్ల వరకు డ్రోన్ల వినియోగం పూర్తి నిషేధం
-
ప్రత్యేక పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి
-
పౌరులు ఆ ప్రాంతంలో అనవసరంగా తరలివెళ్లకూడదు అని అధికారులు సూచన
ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇప్పటికే సిబ్బంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించటం ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర గవర్నమెంట్ ఏజెన్సీలు సంయుక్తంగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నాయి. యోగా దినోత్సవం వేడుకలు విశాఖ బీచ్ రోడ్ పై భారీగా నిర్వహించనున్న నేపథ్యంలో, ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.