TPCC President:

TPCC President: రేస్‌-కేసుపై టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

TPCC President: ఫార్ములా ఈ రేస్ కేసుపై టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్ గౌడ్ ప‌లు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఈ కేసులో ఏ1 నిందితుడు, మాజీ మంత్రి కేటీఆర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కేటీఆర్‌పై ఈ కేసు న‌మోదు స‌క్ర‌మమేన‌ని, అక్ర‌మాలు జ‌రిగిన మాట వాస్త‌వమేన‌ని చెప్పారు. అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు ఆధారులున్నా, క‌డిగిన ముత్య‌మంటూ కేటీఆర్ త‌న‌కు తానే స‌ర్టిఫికెట్ ఇచ్చుకోవ‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని పేర్కొన్నారు.

TPCC President: గ‌వ‌ర్న‌ర్ న్యాయ స‌ల‌హా తీసుకొనే ఈ కేసుపై అనుమ‌తించాక ఇది అక్ర‌మ కేసు ఎలా అవుతుంద‌ని మ‌హేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. చ‌ట్ట‌ప‌రంగా కార్ రేస్‌పై కేసు న‌మోదైనందున అసెంబ్లీ చ‌ర్చ పెట్టేదికాద‌ని, కోర్టుల్లోనే తేల్చుకోవాల‌ని స‌వాల్ విసిరారు. హెచ్ఎండీఏ భాగ‌స్వామ్యం కాకున్నా, దాని ఖాతా నుంచి ఆర్థిక ప‌ర‌మైన అనుమ‌తులు లేకుండా రూ.54.88 కోట్లు చెల్లించేలా కేటీఆర్ ఒత్తిడి చేశార‌ని ఆరోపించారు.

TPCC President: ఆధారాలు కండ్ల ముందే క‌నిపిస్తున్నా, అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని కేటీఆర్ బుకాయిస్తున్నార‌ని మ‌హేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉండ‌గా, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా విదేశీ కంపెనీల‌కు నిధులెలా ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. హ‌ద్దుల్లేని కేటీఆర్ అక్ర‌మాల‌తో అధికారులు బ‌ల‌య్యార‌ని తెలిపారు. నిబంధ‌న‌లు పాటించ‌కుండా పెద్ద మొత్తంలో విదేశీ సంస్థ‌ల‌కు నిధులివ్వ‌డంతో ఆదాయ ప‌న్ను శాఖ‌కు హెచ్ఎండీఏ రూ.8 కోట్లకు పైగా ప‌న్ను చెల్లించాల్సి వచ్చింద‌ని తెలిపారు.

TPCC President: నిబంధ‌న‌ల‌ను కాద‌ని మూడేండ్ల‌లో రూ.600 కోట్లు చెల్లించేలా కేటీఆర్ అనుమ‌తితోనే ఒప్పందం చేసుకున్నార‌ని మ‌హేశ్‌కుమార్ ఆరోపించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా హుస్సేన్‌సాగ‌ర్ చుట్టూ ఫార్ములా ఈ కార్ రేసు కోసం 2.8 కిలోమీట‌ర్ల ప్ర‌త్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేశార‌ని తెలిపారు. బీఆర్ఎస్ నేత‌ల దోపిడీతో హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బ‌తిన్న‌ద‌ని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *