Telangana: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. పార్టీపై, ప్రభుత్వంపై మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన అనుచరుడి హత్యకు మంగళవారం జగిత్యాలలో నిరసన వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్.. జీవన్‌రెడ్డికి పోన్‌లో మాట్లాడారు. సముదాయించేందుకు ప్రయత్నించగా, జీవన్‌రెడ్డి మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: కాంగ్రస్ పార్టీలో ఎందుకుండాలి.. చంపించుకోవడానికా అంటూ హాట్ కామెంట్స్ వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే మహేశ్‌కుమార్‌గౌడ్ మరో విషయం మాట్లాడబోగా, పక్కనే ఉన్న ఓ నేత ముందుకు జీవన్‌రెడ్డి ఫోన్‌ను విసిరేశారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ముదిరిపాకాన బడ్డట్టు అయింది.