Toxic: రాకింగ్ స్టార్ యాష్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన “టాక్సిక్” టీజర్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో నెగటివ్ మరియు పాజిటివ్ చర్చలు జోరుగా సాగుతున్నాయి. దీనికి తోడు, ఈ సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకూడదని కోరుతూ CBFC కి లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ముందుగా నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే.. టీజర్‌లో ఉన్న అడల్ట్ షాట్స్ చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది. గతంలో యాష్ కన్నడ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులతో కలిసి చూడలేని సినిమాను తీయనని చెప్పారు. కాని ఇపుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన మాటలు, విలువలు మర్చిపోయారా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఇంకో వైపు, సినిమా టీజర్‌లోనే ఇంత అడల్ట్ కంటెంట్ ఉంటే సినిమాలో ఇంకెంత ఉంటుంది? ఇలాంటి సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తే భవిష్యత్తులో మరిన్ని అడల్ట్ కంటెంట్ సినిమాలు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకే ఈ సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ CBFC కి లేఖ రాశారు.
ఇది కూడా చదవండి: Rajya Sabha: దేశవ్యాప్తంగా ఖాళీ కానున్న 73 రాజ్యసభ స్థానాలు.. తెలుగు రాష్ట్రాల నుండి 6 మంది
ఇక పాజిటివ్స్ గురించి చెప్పుకుంటే.. సినిమా కథలో మరియు హీరో క్యారెక్టరైజేషన్‌లో భాగంగానే అడల్ట్ సీన్స్ ఉంటాయని యాష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం, సినిమాపై క్రేజ్ పెంచడానికే ఈ సీన్స్ పెట్టారని తప్ప, సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండదని సమర్థిస్తున్నారు. దీనికి ఉదాహరణగా ‘సాలార్’ సినిమా ప్రమోషన్ గురించి ప్రస్తావిస్తున్నారు. సాలార్ టీజర్‌లో ఉన్న సీన్ సినిమాలో లేదు కాబట్టి, టాక్సిక్ టీమ్ కూడా అదే స్ట్రాటజీని అనుసరిస్తోందని అభిప్రాయపడుతున్నారు.
టీజర్ పైన స్పందించిన ఆర్జీవీ.. పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా అలాంటి సీన్స్ తీయడానికి భయపడతారని, కానీ ఒక లేడీ అయ్యుండి గీతూ మోహన్ దాస్ ఇలాంటి సీన్స్ తీయడం గ్రేట్ అంటూ మెచ్చుకున్నారు.
After seeing the @TheNameIsYash starring trailer of #Toxic I have no doubt that @GeethuMohandas_ is the ultimate symbol of Women Empowerment ..No Male director is Man enough in comparison to this Woman .. I still can’t believe she shot this 👇🏻 😳 https://t.co/ZxyxU8Da40 pic.twitter.com/qzFUcv9JIb
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2026
గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యాష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, కియారా అద్వానీ, హుమా ఖురేషి వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 2026 మార్చి 19న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
