Sharwanand: హీరో శర్వానంద్ నటిస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం షూటింగ్ పూర్తయింది. అయితే, రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఓటీటీ డీల్ ఆలస్యం కారణంగా వాయిదా పడుతోందని టాక్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలవనుందని సమాచారం. చిరంజీవి, ప్రభాస్, రవితేజ వంటి స్టార్స్ సినిమాలతో ఈ సీజన్ హోరెత్తనుంది. శర్వానంద్ ఈ రిస్క్ తీసుకుంటాడా? పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Krrish 4: క్రిష్ 4 నుంచి క్రేజీ అప్డేట్!
‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం శర్వానంద్ అభిమానులకు పండగలా ఉండనుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తైనప్పటికీ ఓటీటీ ఒప్పందాల కారణంగా రిలీజ్ వాయిదా పడింది. సంక్రాంతి సీజన్‌లో ఈ చిత్రం విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కానీ, చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’, ప్రభాస్ ‘ది రాజాసాబ్’, రవితేజ RT76, నవీన్ పొలిశెట్టి చిత్రాలతో పాటు తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజ్ కానున్నాయి. ఈ భారీ పోటీలో శర్వానంద్ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.