అంతా సైలెన్స్.. నాగార్జునపై కేసు దెబ్బకు భయపడ్డారా?

మూడు రోజులక్రితం.. తేల్చుకుంటాం.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం.. సినీ ఇండస్ట్రీ జోలికి రావద్దు.. రాజకీయ లబ్ది కోసం మమ్మల్ని వాడుకోవద్దు. ఈ మాటలన్నీ గుర్తున్నాయా?

అవును.. మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన కొన్ని వ్యాఖ్యల అనంతరం దాదాపు సినీ ఇండస్ట్రీ అంతా కలిసి చేసిన దాడి ఇది. కొండా సురేఖ ఏమన్నారు అనేది అందరికీ తెలిసిందే. దానిపై రేగిన దుమారమూ అందరం చూశాం. ఆ తరువాత కొండా సురేఖ సమంత ను ఉద్దేశించి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పారు. అయినా, ఈ రచ్చ చల్లారలేదు. సినిమా ఇండస్ట్రీ అంతా ఎప్పుడూ లేని విధంగా ఏకం అయి కొండా సురేఖ కు వర్కింగ్స్ ఇచ్చినట్టుగా మాట్లాడారు. 

మొదట్లో ఆచి తూచి వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైతే కొండా సురేఖ తన మాటల్ని బేషరతుగా ఉపసంహరించుకుంటానని చెప్పినప్పటికీ, సినీ వర్గాల నుంచి వచ్చి పడుతున్న మాటల దాడిని తిప్పికొట్టడం మొదలు పెట్టారు. మంత్రి కొండా సురేఖను టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే ఊరుకోము అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈలోగా వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి నాగార్జున ఎన్ కన్వెన్షన్ వైపు వెళ్ళింది. దీనిపై ఒక స్వచ్చంధ సంస్థ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. చెరువు స్థలాన్ని ఆక్రమించి కట్టిన కట్టడం ద్వారా కోట్లాది రూపాయలు నాగార్జున వెనకేసుకున్నారనీ.. అదంతా ప్రజల సొమ్మని.. దానిని నాగార్జున దగ్గర నుంచి వెనక్కి వసూలు చేయాలనీ కోరుతూ ఆ స్వచ్చంధ సంస్థ  ఫిర్యాదు చేయడంతో నాగార్జునపై కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. 

ఎప్పుడూ సినీ పరిశ్రమ పార్టీలతో సంబంధం లేకుండా.. ఎవరు అధికారంలో ఉన్నా, వారితో మంచిగానే ఉంటూ వస్తోంది. కానీ, ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా.. సినీ పరిశ్రమ నుంచి ఎవరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం కానీ, కాంగ్రెస్ పార్టీని అభినందించడం కానీ జరగలేదు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. దీంతో కొండా సురేఖ వ్యాఖ్యలకు సినీ పరిశ్రమ మొత్తం ఏకం కావడం వెనుక గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అందుకే ఒక్కసారిగా సినీ పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొన్నం ప్రభాకర్ అయితే, కాస్త ఘాటుగానే హెచ్చరించారు. 

ఇప్పుడు సినిమా పరిశ్రమ అంతా సైలెంట్ అయిపోవడం వెనుక ప్రభుత్వం హెచ్చరికలకు భయపడ్డారా? అనే చర్చ నడుస్తోంది. ఒక పక్క నాగార్జున కొండా సురేఖ వ్యాఖ్యలపై న్యాయస్థానంలో కేసు వేశారు. ఈ నేపథ్యంలో ఇక అది నాగార్జున vs కొండా సురేఖ అనే ధోరణికి సినీ పరిశ్రమ వచ్చిందా? ఏది ఏమైనా కానీ, ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టం అవుతోంది. కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా నాగార్జున కుటుంబానికి పరువు నష్టం కలిగించేవే. సమంతను కోట్ చేస్తూ మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నటు చెప్పారు కానీ, నాగార్జున కుటుంబానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై వెనకడుగు వేసినట్టు కనిపించలేదు. ఈ నేపథ్యంలో నాగార్జున కోర్టులో కేసు వేయడంతో సమస్య ఇప్పుడప్పుడే సమసిపోయేలానూ లేదు. కానీ, ఒక్కసారిగా ఎగిరిపడ్డ సినిమా పరిశ్రమలోని వారంతా.. పొంగే పాల మీద నీళ్లు చల్లినట్టుగా ప్రభుత్వ తీరుతో అదే స్థాయిలో ఒకేసారి చల్లబడిపోవడమే విశేషం. ఇంతకీ సినీ పరిశ్రమ భయపడిందంటారా? 

ALSO READ  CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *