Film Chamber: నాలుగు రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె కారణంగా టాలీవుడ్‌లో సినిమాల షూటింగ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వేతనాల పెంపు కోసం కార్మిక సంఘాలు బంద్ కు పూనుకున్నాయి. దీనితో షూటింగులు నిలిచిపోయి, పరిశ్రమలో ఓ ఉద్విగ్నత నెలకొంది.
ఈరోజు (గురువారం) ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు కీలక చర్చలు జరపనున్నారు. వేతనాల పెంపుతో పాటు, రోజుకు చేసిన పని చెల్లింపులు అదే రోజు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఫెడరేషన్ సభ్యులు చర్చల అనంతరం పలు ప్రముఖులను కలవనున్నారు. ముందుగా ఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజును కలవనున్నారు. తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని, అనంతరం మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ అభ్యర్థనలు వివరించనున్నారు.
ఇది కూడా చదవండి: Kochi; మలయాళ నటి శ్వేతా మేన్‌పై కేసు నమోదు – కోర్టు ఆదేశాలతో పోలీసుల చర్యలు…
ఫెడరేషన్ నాయకులు చెబుతున్నది “చిరంజీవి గారు తీసుకునే నిర్ణయాన్ని మేమంతా గౌరవిస్తాం, ఆయన మార్గదర్శకత్వంలోనే ముందుకు వెళ్తాం.
ఇక నిర్మాతల వైపు చూస్తే, త్వరగా ఈ సమస్య పరిష్కారం కావాలని ఆశిస్తున్నారు. షూటింగులు మళ్లీ ప్రారంభించాలని కోరుకుంటున్నారు. ఫెడరేషన్ సభ్యులు మరోపక్క పీపుల్స్ మీడియా నిర్మాత విశ్వప్రసాద్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. “ఇక్కడ స్కిల్స్ లేవన్న మాట దారుణం” అంటూ ఘాటుగా స్పందించారు.
ఇక నిన్న ఫెడరేషన్ సభ్యులు నందమూరి బాలకృష్ణను కలవగా, “ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుంది” అని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈరోజు జరిగే చర్చలతో కార్మికుల సమ్మెకు ముగింపు పలకుతుందో లేదో అనే విషయంపై పరిశ్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.