Tollywood: వెంకీ మామ సునామీ.. అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా సంక్రాంతికి వస్తున్నాం..

Tollywood: సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 20 రోజులు అయినప్పటికీ, ఈ మూవీ కలెక్షన్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. వీకెండ్స్‌లో థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

303 కోట్లు వసూలు – ఇండస్ట్రీ హిట్

తాజాగా, ఈ చిత్రానికి ఇప్పటివరకు ₹303 కోట్లు వచ్చినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినట్టు పోస్టర్ కూడా విడుదల చేశారు.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మొదటి వారంలోనే భారీ వసూళ్లు రాబట్టి, టాలీవుడ్‌లో నూతన రికార్డులను క్రియేట్ చేసింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో హిట్ మూవీ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించారు. భీమ్స్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

వెంకీమామ – ఐశ్వర్య రాజేశ్ జోడీ హైలైట

ఈ చిత్రంలో వెంకీమామ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. సినిమా పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.ఈ విధంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్ల పరంగా భారీ రికార్డులు సృష్టిస్తూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకుపోతోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Shilpa Shirodkar: జీవితంపై విరక్తి కలిగిందంటున్న మహేష్ మరదలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *