Tollywood Josh: టాలీవుడ్‌లో సమ్మర్ సీజన్ ఎప్పుడూ సినిమా పండగలా సందడి చేసేది. గతంలో ఈ సీజన్‌లో సినిమాలు బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్‌తో పాటు భారీ వసూళ్లు సాధించేవి. కానీ, ఇటీవలి కాలంలో ఈ జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. 2025లోనూ సరైన హిట్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.
రెట్రో ట్రైలర్ ఇక్కడ చూడండి :
Also Read: Varuntej- Lavanya : మెగా ఫ్యామిలీలో గుడ్ న్యూస్: వరుణ్ తేజ్, లావణ్య తల్లిదండ్రులుగా మారనున్నారా?
గత నెలలో ‘మ్యాడ్ స్క్వేర్’ తప్ప మరో సాలిడ్ హిట్ రాలేదు.
ఇప్పుడు థియేటర్లలో ఆడియెన్స్ దాహం తీర్చేందుకు రెండు భారీ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. నాని నటిస్తున్న ‘హిట్ 3’, సూర్య నటిస్తున్న ‘రెట్రో’ చిత్రాలు రెండు భాషల్లో మంచి బజ్ సృష్టించాయి. ఈ సినిమాలకు ఇప్పటికే బలమైన బుకింగ్స్ నమోదవుతున్నాయి. మంచి టాక్ వస్తే ఈ చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అంటున్నారు. ఆడియెన్స్ ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాక్‌తో పాటు విజయం సాధిస్తాయా? వేచి చూడాలి!
హిట్ 3 తెలుగు ట్రైలర్ ఇక్కడ చూడండి :

