Konda Surekha

Tollywood Support: కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ లో దుమారం.. ఒక్కతాటిపైకి సినీ పెద్దలు

Tollywood Support: అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అటు పొలిటికల్ గా ఇటు సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఈక్రమంలో అక్కినేని కుటుంబానికి తెలుగు సినీ ఇండస్ట్రీగా అండగా నిలుస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎవరేమన్నారంటే . .

. ఇది అవమానించడం కంటే ఎక్కువ : రవితేజ

సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు రవితేజ ఘాటుగా స్పందించారు. ‘ఓ మహిళా మంత్రి రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచమైన ఆరోపణలు చేస్తూ పైశాచిక వ్యూహాలను అవలంబించడం భయాందోళనకు గురిచేస్తోంది. ఇది అవమానించడం కంటే ఎక్కువ. తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను ఎవరూ లాగకూడదు. నాయకులు సామాజిక విలువలను పెంచాలి, వాటిని తగ్గించకూడదు’ అని ఫైరయ్యారు.

మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: నాగబాబు

మంత్రి స్థాయిలో ఉండి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సంస్కారహీనం అవుతుందని నటుడు, జనసేన నేత నాగబాబు అన్నారు. ‘స్వలాభాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. నాగార్జున కుటుంబానికి, సమంతకు, చిత్రసీమకు నేను అండగా నిలబడతాను’ అని ట్వీట్ చేశారు.

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Tollywood Support: మంత్రి కొండా సురేఖ నటి సమంతపై చేసిన వ్యాఖ్యలకు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ‘ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరం. నేను రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. 365 రోజులూ సమంతను దగ్గరుండి చూశా. ఒక అభిమానిగా చెప్తున్నా ఆమె తెలుగు ఇండస్ట్రీకి దొరికిన వరం. ఆమె ఆర్టిస్ట్‌గా కాదు.. ఇంట్లో అక్కలా అనిపించేవారు. సురేఖ గారు మాట్లాడింది తప్పు’ అని పేర్కొన్నారు.

కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: పురందీశ్వరి

Tollywood Support: అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి తెలిపారు. ‘రాజకీయ నాయకులు దేశానికి, రాష్ట్రానికి సేవ చేస్తే, సినీనటులు ప్రజలకు వినోదం అందిస్తారు. ఇతరులను కించపరచకుండా, వారిని గౌరవిస్తే సముచితంగా ఉంటుంది. సినీ, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తిగా, మహిళగా మంత్రి మాటలను ఖండిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తారు?: లావణ్య

Tollywood Support: అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మెగా హీరో వరుణ్ తేజ్, ఆయన భార్య లావణ్య త్రిపాఠి స్పందించారు. ‘సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఓ మహిళే తన తోటి మహిళను అవమానించడం సిగ్గుచేటు. ఎందుకు ఎప్పుడూ మమ్మల్నే టార్గెట్ చేస్తారు?’ అని ఫైర్ అయ్యారు. మరోవైపు మంచు లక్ష్మీ ప్రసన్న కూడా స్పందించారు. ఇటువంటి  వ్యాఖ్యల వల్ల బాధిత మహిళలు తీవ్ర క్షోభ అనుభవిస్తారని చెప్పారు.

కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నా: నాగార్జున

“రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను.. మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. మా కుటుంబంపై సురేఖ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం. బాధ్యత గల పదవిలో ఉన్న సురేఖ వ్యాఖ్యలు సరికాదు
తక్షణమే సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి” అంటూ  నాగార్జున ట్వీట్ చేశారు .

కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత

సినీ ఇండస్ట్రీలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నా. గ్లామర్ పరిశ్రమలో రాణించాలంటే చాలా శక్తి కావాలి. దయచేసి నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు. విడాకులు పూర్తిగా నా వ్యక్తిగత విషయం.. మా ఇద్దరి అంగీకారంతోనే విడాకులు అంటూ సమంత ట్వీట్ చేశారు .

కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన అక్కినేని అమల

” మహిళా మంత్రి వ్యాఖ్యలు బాధ కలిగించాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలి.
రాజకీయ వివాదంలోకి మమ్మల్ని లాగడం సరికాదు. నా భర్త గురించి నిరాధారమైన ఆరోపణలు చేశారు.
మా కుటుంబానికి మంత్రి క్షమాపణ చెప్పాలి” అని అమల ఈ విషయంపై స్పందించారు .

సమంతకి మంత్రి కొండా సురేఖ ట్వీట్‌

Tollywood Support: సమంతపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ ఒక ట్వీట్ చేశారు .
“నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే.. సమంత మనోభావాలను దెబ్బతీయం కాదు. నా వ్యాఖ్యల పట్ల మీరు, మీ అభిమానులు మనస్తాపానికి గురైతే..
బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా. స్వయం శక్తితో సమంత ఎదిగిన తీరు..
నాకు అభిమానమే కాదు.. ఆదర్శం కూడా. నా వ్యాఖ్యలను అన్యధా భావించవద్దు” అంటూ మంత్రి  కొండా సురేఖ ట్వీట్ చేశారు .

చిరంజీవి అభ్యంతరం . . 

Tollywood Support: మా సభ్యులపై దుర్మార్గపు మాటల దాడిని వ్యతిరేకిస్తాం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు .  సంబంధంలేని వ్యక్తులను, మహిళలను..తమ రాజకీయాల్లోకి లాగడం దారుణం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు .  మీ ప్రసంగాల ద్వారా సమాజాన్ని కలుషితం చేయొద్దు. నిరాధార ఆరోపణలు చేస్తూ దిగజారొద్దు అని చిరంజీవి కొండా సురేఖకు సూచించారు .

కొండా సురేఖ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ట్వీట్

సినీ కుటుంబాలపై కించపరిచే వ్యాఖ్యలను ఖండిస్తున్నా
ఈ వ్యాఖ్యలు తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధం
ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను అంగీకరించొద్దు
వ్యక్తిగత గోప్యతను గౌరవించాలి: అల్లు అర్జున్

కొండా సురేఖ మాటలు విడ్డూరంగా ఉన్నాయి: సుధీర్‌బాబు

సినీ ప్రముఖులను రాజకీయ పావులుగా వాడుకోవడం.. మీ నిరాశను తెలియజేస్తుంది. తెలంగాణకు గర్వకారణమైన పరిశ్రమను అవమానపరిచారు. గాసిప్ నుంచి పాలన వైపు దృష్టి మరల్చాలి: సుధీర్‌బాబు

కొండా సురేఖ వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ ట్వీట్

కన్నులతో చూసి, చెవులతో విన్నట్టు చెప్పడం దారుణం
సమంత, నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను..
తీవ్రంగా ఖండించాలి: రాంగోపాల్‌ వర్మ

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై వెంకటేష్‌ ట్వీట్

రాజకీయాలకు నటులను వాడుకోవడం బాధాకరం
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయ లబ్ధి కోసం..
వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చడం దురదృష్టకరం
నటులను రాజకీయాల్లోకి లాగడం ఎవరికి ఉపయోగకరం
మన చర్యలు, మాటలు విలువ కలిగి ఉండాలి: వెంకటేష్

కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన మంచు విష్ణు

నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడు ఉంటాం. మా వ్యక్తిగత జీవితాలను ప్రజాచర్చల్లోకి లాగొద్దు.
సినీపరిశ్రమను ఎవరైనా బాధపెడితే ఊరుకోం: మంచు విష్ణు

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *