NATS America telugu sambaralu

NATS: నాట్స్ తెలుగు సంబరాలకు అతిథిగా అందాల శ్రీలీల

America Telugu Sambaralu: అమెరికాలో తెలుగు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS ప్రతి ఏటా తెలుగు ప్రజలందరినీ ఒక్కదగ్గరికి చేరుస్తూ . . సంబరాలు నిర్వహిస్తూ వస్తోంది .  తెలుగు సంప్రదాయాలు . . సంస్కృతిని ప్రతిబింబించేలా అక్కడి తెలుగు ప్రజలే కాకుండా స్థానిక ప్రజలు కూడా చెప్పుకునేలా ఈ సంబరాలను నిర్వహిస్తున్నారు .  ఈ సంవత్సరం 8వ అమెరికా తెలుగు సంబరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు .

America Telugu Sambaralu: జూలై 4 నుంచి 6 వరకూ మూడురోజుల పాటు తెలుగు సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించబోతున్న ఈ సంబరాల్లో పాల్గొనడానికి అతిరధమహారథులు రానున్నారు . తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారధులు హాజరు కానున్న ఈ సంబరాల్లో తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు . ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్సవాల్లో సందడి చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే .  ఇక టాలీవుడ్ అందాల తార  శ్రీలీల ఈ 8వ అమెరికా సంబరాల్లో పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు.   మూడురోజుల పాటు జరిగే ఈ తెలుగు ఉత్సవంలో తెలుగుతనం ఉట్టిపడేలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆధ్యాత్మిక ప్రవచనాలు . . అతిథులతో ముచ్చట్లు . . ఇలా ఎన్నో అలరించే కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు .  యూఎస్ లో ఉంటున్న అందరు తెలుగు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు .

టంపా కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహించే ఈ సంబరాలకు మహాన్యూస్ ,  మహాన్యూస్ యూఎస్ఏ అధికార మీడియా పార్తనర్స్ గా వ్యవహరిస్తున్నారు. అమెరికా తెలుగు సంబరాలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది మహా న్యూస్ .

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *