Tollywood: తెలుగు ప్రేక్షకులకు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొణిదెల నిహారిక, ఇప్పుడు నిర్మాతగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఆమె స్థాపించిన నిర్మాణ సంస్థ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ నుంచి మరో క్రియేటివ్ సినిమా రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కాస్టింగ్ కాల్ను వారు అధికారికంగా ప్రకటించారు.
ఈ సంస్థ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.2 చిత్రానికి 3 నుండి 6 ఏళ్ల వయసున్న బాలికలు కావాలంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. నటన పట్ల ఆసక్తి ఉండే, కెమెరాను ఇష్టపడే చిన్నారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇది బాల నటులకు తమ ప్రతిభను చాటుకునే అరుదైన అవకాశమని సంస్థ పేర్కొంది.
తల్లిదండ్రులు తమ చిన్నారుల ఫొటోలు, వీడియోలు, ప్రొఫైల్ వివరాలు
📧 pinkelephantpictures2@gmail.com
📱 వాట్సాప్: 9100480537
కి పంపించవచ్చని తెలిపారు.
ఈ చిత్రానికి నిహారిక నిర్మాతగా వ్యవహరించగా, మానస శర్మ దర్శకురాలు. యువ నటుడు సంగీత్ శోభన్ ఇందులో హీరోగా నటించనున్నాడు. త్వరలోనే మిగతా తారాగణం వివరాలు ప్రకటించనున్నారు.
“మీ చిన్నారితోనే తదుపరి పెద్ద కథ మొదలవచ్చు!” అనే నినాదంతో ఈ ప్రకటన విడుదలైంది.