Toll Plaza Information: వాహనదారులకు టోల్ ఫీజు తగ్గని భారంగా మారుతుంది. ఎక్కడైనా, ఏ వేళయినా ఈ భారం తప్పడం లేదు. కొన్నిచోట్ల టోల్ గడువు తీరినా వసూళ్లు ఆగడం లేదని ఆరోపణలూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టోల్‌ప్లాజాలలో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత అక్టోబర్ నుంచి పెరిగిన టోల్ భారంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు.
Toll Plaza Information: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ-గుంటూరు మధ్య కాజ వద్ద ఉన్న టోల్‌ప్లాజాతోపాటు రాష్ట్రంలోని 65 టోల్ ప్లాజాలలో ఇదే పరిస్థితి నెలకొన్నది. వీటి బీవోటీ గడువు సెప్టెంబర్ నాటికి ముగిసింది. దీంతో అక్టోబర్ నుంచి కొత్త నిబంధనల ప్రకారం టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. గతంలో సెప్టెంబర్ వరకు ఒకసారి వెళ్తే కారుకు రూ.160, తిరుగు ప్రయాణంలో రూ.80 చెల్లిస్తే సరిపోయేది. 24 గంటల వ్యవధిలో ఎన్నిసార్లు తిరిగినా టోల్ వసూళ్లు ఉండేవి కాదు.
Toll Plaza Information: కానీ అక్టోబర్ నుంచి అమలులోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త నిబందనల ప్రకారం ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు ఒకవైపు పూర్తి ఫీజు, రెండోసారి సగం ఫీజు చొప్పున వసూలు చేస్తున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారిపై నిత్యం వందలాది వాహనాల్లో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఒకటికి పలుసార్లు తిరగాల్సి వస్తుంది. ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు టోల్ బాదుడు తప్పడం లేదు. వాహనదారులపై టోల్ రూపంలో తీవ్ర భారం పడుతున్నది.
Toll Plaza Information: వచ్చే నెలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రజల రాకపోకలు పెరగనున్నాయి. ఆ నెలంతా రాకపోకలు అధికంగా ఉంటాయి. రాష్ట్రమంతా ఈ తాకిడి ఉంటుంది. అన్నిటోల్ ప్లాజాలల్లో రాకపోకలు అధికంగానే ఉంటాయి. దీంతో వచ్చిన ప్రతిసారి వాహనదారులకు టోల్ ఫీజుల భారం పడుతుంది.