Vice-President Election

Vice-President Election: నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక.. NDA మార్క్ ఎంత?

Vice-President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇవాళ జరగనుంది. ఓటింగ్ ఉదయం10 గంటలకు ప్రారంభమై సాయంత్రం5 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం.6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. NDA అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌, ప్రతిపక్ష కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. లోక్‌సభ, రాజ్య సభ కలిపి మొత్తం 786 ఓట్లు ఉండగా, 394 ఓట్లు వచ్చిన వారు వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతారు. NDA ఆ మార్క్ కంటే ఎక్కువ మంది సభ్యుల్ని (422) కలిగి ఉండటం గమనార్హం.
భారత్‌లో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి. ఈ పదవిని చేపట్టిన వారు రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ సభ సజావుగా, గౌరవప్రదంగా సాగేలా చూస్తారు. సభలో తటస్థంగా ఉంటారు. వీరు బిల్లులపై ఓటేసేందుకు వీలుండదు. ఎప్పుడైనా టై అయితే మాత్రమే కాస్టింగ్ ఓటు వేస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 65 ప్రకారం ఏదైనా కారణంతో రాష్ట్రపతి సీటు ఖాళీ అయితే వైస్ ప్రెసిడెంట్ తాత్కాలికంగా రాష్ట్రపతి విధులను చేపట్టవచ్చు.

ఇది కూడా చదవండి: Nepal: నేపాల్‌లో రాజకీయ కలకలం – హోంమంత్రి రమేష్‌ లేఖక్‌ రాజీనామా

ఏ పార్టీ మద్దతు ఎవరికి?
రాధాకృష్ణన్(ఎన్డీఏ అభ్యర్థి): బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన-షిండే, YCP, LJP, అన్నాడీఎంకే(పళనిస్వామి), JDS, జనసేన, RLD, అప్నాదళ్, NCP(అజిత్ పవార్), SKM, స్వతంత్రులు.

సుదర్శన్ రెడ్డి (ఇండీ కూటమి): కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, TMC, ఆప్, డీఎంకే, శివసేన(ఉద్ధవ్), NCP(శరద్ పవార్), RJD(లాలూ), CPM, CPI, ఎంఐఎం.
* బీఆర్ఎస్(4), బీజేడీ(7) దూరం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nikhil Sosale: RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోషల్ ఎవరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *