Telangana Bandh: గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు స్థానిక వ్యాపారులపై దౌర్జన్యం చేస్తున్నారంటూ నేడు ( ఆగస్టు 22)వ తేదీన తెలంగాణ బంద్‌కు ఉస్మానియా యూనివర్శిటీ JAC పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు ప్రధానంగా ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ (OU JAC) నాయకత్వం వహిస్తోంది. వారికి మద్దతుగా నల్గొండ మరియు వరంగల్ జిల్లాల వ్యాపార సంఘాలు, పలు విద్యార్థి సంఘాలు, మరియు కొన్ని దళిత సంఘాలు కూడా చేరాయి. హైదరాబాద్‌లోని మోండా మార్కెట్‌లో ఒక దళితుడిపై జరిగిన దాడి ఈ బంద్‌కు ప్రధాన కారణం.
ఆ దాడిని మార్వాడీ వర్తకులు చేశారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, మరియు యూనివర్శిటీలకు సెలవు ప్రకటించవచ్చు. ఈ రోజు జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Tollywood: టాలీవుడ్‌లో వివాదానికి తెర.. రేపటి నుంచి షూటింగులు షురూ
హైదరాబాద్‌లోని మోండా మార్కెట్‌తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార సంస్థలు మరియు షాపులు మూసివేసే అవకాశం ఉంది.బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలు చోట్ల నిరసనకారులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ.. గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన మార్వాడీలు తెలంగాణకు వలస వచ్చి… ఇక్కడి కుల వృత్తులను దెబ్బతీస్తున్నారన్నారని ఆరోపించారు. ఒకప్పుడు తెలంగాణ.. ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే.. ఇప్పుడు రాష్ట్రాన్ని మార్వాడీలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. వారు ఇక్కడ ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారి ఆరోపించారు. అక్కడితో ఆగకుండా స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.