Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త! గత కొద్ది రోజులుగా ఆకాశాన్నంటుతున్న పసిడి, వెండి ధరలకు సోమవారం బ్రేక్ పడింది. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. రికార్డు స్థాయికి చేరిన ధరలు కాస్త దిగిరావడంతో పండుగలు, పెళ్లిళ్లకు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కాస్త ఊరట కలిగించే వార్త.
పెరిగిన ధరలకు కారణాలివే..
అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులు, డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వంటివి బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు. దీనికి తోడు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు తగ్గించి, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బులియన్ మార్కెట్‌లోకి ఇన్వెస్టర్లు ఎక్కువగా వెళ్తున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ కూడా పెరిగి, ధరలు మరింత ఎగబాకాయి.
తాజా ధరల వివరాలు (సెప్టెంబర్ 8, 2025 నాటికి):
24 క్యారెట్ల బంగారం: పది గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గి, రూ. 1,08,350గా ఉంది.
22 క్యారెట్ల బంగారం: పది గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 99,350గా ఉంది.
వెండి: కిలో వెండి ధర రూ. 1,000 తగ్గి, రూ. 1,27,000గా నమోదైంది.
ప్రధాన నగరాల్లో ధరలు (10 గ్రాములకు):
హైదరాబాద్ & విజయవాడ: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,380. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 99,350. కిలో వెండి ధర రూ. 1,37,000.
ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,530. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 99,500. కిలో వెండి ధర రూ. 1,27,000.
ముంబై: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,380. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 99,350. కిలో వెండి ధర రూ. 1,27,000.
చెన్నై: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,770. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 99,700. కిలో వెండి ధర రూ. 1,37,000.


