Horoscope Today:
మేషం (Aries): ఈ రోజు మీరు చేసే ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. గణనాయకాష్టకం పఠిస్తే మరిన్ని విజయాలు లభిస్తాయి.
వృషభం (Taurus): స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఒక శుభవార్త మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన మీకు శుభప్రదం.
మిథునం (Gemini): మనోబలంతో ముందుకు సాగండి. బంధువుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించడం మర్చిపోవద్దు.
కర్కాటకం (Cancer): పనుల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా అధిగమిస్తారు. మాటల్లో ఆచితూచి వ్యవహరించాలి. లక్ష్మీ స్తోత్రం చదవడం వల్ల మేలు జరుగుతుంది.
సింహం (Leo): పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వండి. వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
కన్య (Virgo): పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.
తుల (Libra): అదృష్టం మీ వెంటే ఉంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. శివారాధన చేయడం వల్ల మంగళం కలుగుతుంది.
వృశ్చికం (Scorpio): కుటుంబంలో చిన్నపాటి గొడవలు రావచ్చు, సహనంతో ఉండండి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
ధనుస్సు (Sagittarius): కుటుంబంలో శుభవార్తలు వింటారు. మీ తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు. మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు.
మకరం (Capricorn): ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తే ఇబ్బందులు తప్పవు. బంధువుల సూచనలు వినడం మంచిది. శివాలయాన్ని సందర్శించండి.
కుంభం (Aquarius): చేపట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. చిన్న సమస్యలు వచ్చినా మీ బుద్ధిబలంతో పరిష్కరించుకుంటారు.
మీనం (Pisces): వృత్తి, వ్యాపారాల్లో భారీ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వినాయకుడిని పూజించడం వల్ల శుభం జరుగుతుంది.
