Tirupathi: తిరుపతి రైల్వే స్టేషన్‌లో నిన్న (సోమవారం) సాయంత్రం ఊహించని అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లూప్‌లైన్‌లో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్, షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని కొన్ని బోగీలలో మంటలు చెలరేగి, ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగనప్పటికీ, బోగీలు పూర్తిగా కాలిపోయాయి.
Also Read: Delhi: అశోక్ గజపతిరాజుకు గౌరవ పదవి.. గోవా గవర్నర్‌గా నియామకం
ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, మంటలు వేగంగా వ్యాపించడంతో రెండు రైళ్లలోని కొన్ని బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై రైల్వే అధికారులు, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
🚨Breaking News 🚨
తిరుపతిలో రైలు ప్రమాదం
హిస్సార్ టు తిరుపతి (04717) ట్రైన్లో చాలా చెలరేగిన మంటలు
రెండు బోగీలు దగ్ధం, సంఘటన ప్రాంతానికి చేరుకున్న ఫైరింజన్లు, రెండు బోగీలు దగ్ధం#FireAccident #Tirupati #Train pic.twitter.com/2BHtU7XSeW
— Telugu Feed (@Telugufeedsite) July 14, 2025

