Tirupati: తిరుపతిలో గత నెల 8న జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిటీ విచారణను ప్రారంభించింది. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, మరో 45 మంది వరకు భక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. క్షతగాత్రులకు సత్వర వైద్య చికిత్సలు అందేలా చొరవ తీసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు ఇతోధికంగా సాయం చేస్తామని భరోసా కల్పించారు.
Tirupati: ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆనాడే న్యాయ విచారణకు ఆదేశించారు. రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. తిరుపతిలోని కలెక్టరేట్ భవనంలోనే జస్టిస్ సత్యనారాయణ మూర్తికి చాంబర్ కేటాయించారు. ఈ మేరకు నేటి నుంచి తొక్కిసలాట ఘటనకు కారణాలను క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. కలెక్టరేట్‌లో కూడా విచారణ ప్రారంభించారు.
Tirupati: తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో శ్యామలరావుతో విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. బైరాగిపట్టెడ, పద్మావతీ పార్కుతో పాటు పబ్లిక్ స్కూల్ ప్రాంతాలను కమిషన్ స్వయంగా పరిశీలించింది. రుయా ఆసుపత్రి వైద్యాధికారులను కూడా కమిషన్ విచారించింది. విచారణ నివేదికను ఆరు నెలల్లో ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.