Tirupati

Tirupati: విలాసాల కోసం ప్రేమజంట దొంగతనం.. శ్రీకాళహస్తి పోలీసులకు చిక్కిన కిరణ్, రహె!

Tirupati: ప్రేమించుకోవడం గొప్ప కాదు.. ప్రేమించిన వారితో కలిసి ఉండాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప.. ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఓ ప్రేమజంట విలాసంగా బ్రతకడానికి ఓ తప్పుడు దారిని ఎంచుకున్నారు.. చివరికి పోలీసులకు దొరికిపోయారు. ప్రియుడు కిరణ్, ప్రియురాలు రహె కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నారు.. దాని కోసం దొంగతనాలు చేసి వచ్చిన డబ్బులతో విలాసంగా జీవించడం మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి సెల్ టవర్లలో ఉపయోగించే రోటార్ పరికరాలను దొంగిలించి అమ్మడం మొదలుపెట్టారు.

దొంగతనాలు చేయడానికి బండి కావాలి కాబట్టి నెల్లూరు జిల్లాలో ఓ ఖరీదైన బైక్ దొంగతనం చేసి, ఆ బైక్ పైన దాదాపు 18 రోటార్‌లను దొంగిలించినట్లు విచారణలో తేలింది. వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. పోలీసులకు దొరకకుండా వాకీటాకీలు కూడా వాడేవారు. మనుషులను బెదిరించడం కోసం నకిలీ గన్ కూడా వాడేవారు. పక్కా సమాచారంతో శ్రీకాళహస్తి పోలీసులు ఈ ప్రేమజంటను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 2 రోటర్లు, రెండు వాకీటాకీలు, ఒక డమ్మీ గన్, అలాగే దొంగిలించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తంగా రూ. 40 లక్షల విలువైన పరికరాలను ఈ జంట దొంగిలించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *