Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా, దేశ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ బుధవారం సాయంత్రం తిరుమల చేరుకోనున్నారు. అలాగే ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ప్రముఖుల పర్యటనలతో తిరుమల, తిరుపతిలో భద్రత ముమ్మరం
ఈ రెండు రోజుల పాటు ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి లతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తిరుమల చేరుకోనుండటంతో, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ లంకెల సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి కమిషనర్ ఎన్. మౌర్య లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి, అన్ని విభాగాల సమన్వయం తప్పనిసరిగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Chiranjeevi-Pawan: ఆర్జీవీ సంచలన కామెంట్స్.. చిరు–పవన్ కాంబో సినిమా తీస్తే.!
ప్రత్యేక సూచనలు – ఆరోగ్యం, విద్యుత్, పారిశుధ్యం
-
ప్రముఖుల దర్శనాల సమయంలో వైద్య శిబిరాలు, అత్యాధునిక అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
-
APSPDCL ద్వారా నిరంతరాయ విద్యుత్ సరఫరా, అగ్నిమాపక చర్యలు, ఆహార భద్రత, పారిశుధ్య ఏర్పాట్లు పర్యవేక్షణలో ఉన్నాయి.
-
ముఖ్యమంత్రి పర్యటన కోసం హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా పరిశీలించారు.
ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి షెడ్యూల్
సెప్టెంబర్ 24 సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకుని తిరుమల వెళ్తారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు. మరుసటి రోజు యాత్రికుల సౌకర్యాల సముదాయం–5ను ప్రారంభించి అమరావతికి బయలుదేరుతారు. సెప్టెంబర్ 25 ఉదయం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకోనున్నారు. తిరుమలలో ప్రముఖులు పాల్గొనే కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా సమగ్ర ప్రణాళికతో అధికారులు ముందడుగు వేస్తున్నారు.