Tirumala News:తిరుమలలో ఇటీవల చిరుతలు కనిపిస్తూ భక్తులకు భయంగొలుపుతున్నాయి. పలుచోట్ల చిరుత పులులు కనిపిస్తూ ఉండటంతో కాలినడకన వెళ్లేవారు, తిరుమలలో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు బిక్కుబిక్కుమంటూ వెళ్లి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోచోట చిరుత కనిపించింది. అది సంచరించే విషయం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కావడం గమనార్హం.
Tirumala News:తిరుమలలోని ఈస్ట్ బాలాజీనగర్ వద్ద చిరుత కనిపించి కలకలం సృష్టించింది. అక్కడి గంగమ్మ గుడి వద్దకు నిన్న (ఆగస్టు 4) అర్ధరాత్రి చిరుత పులి వచ్చింది. గుడి పక్కనే ఉన్న ఓ పిల్లిని నోట కరుచుకొని వెళ్లబోయింది. ఏదో అలికిడి విన్న చిరుత వెంటనే నోట కరిచిన పిల్లిని వదిలి పారిపోయింది. పులి వచ్చింది.. పిల్లిని నోట పట్టింది.. వదిలి వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ దృశ్యాలున్న వీడియో క్లిప్ ఉన్నది.