Tirumala News: హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమలలో జరిగిన ఓ అపచారంపై టీటీడీ చర్యలు తీసుకున్నది. బాధ్యులైన సిబ్బందిపై వేటు వేసింది. ఎంతో నిష్టతో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అలాంటిది కొందరు భక్తుల నిర్వాకంతో అపచారం చోటుచేసుకున్నది. ఈ విషయం వైరల్ కావడంతో ఇతర భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగి చర్యలకు దారితీసింది.
Tirumala News: తిరుమలలో శ్రీవారి మహద్వారం వరకూ ఓ ముగ్గురు భక్తులు పాదరక్షలు ధరించి రావడంపై భక్త జనం భగ్గుమన్నది. క్యూలైన్లలో నుంచి చాలా దూరం నడిచి వచ్చినా భద్రతా సిబ్బంది గుర్తించకపోవడంపై టీటీడీ ఆగ్రహానికి గురయ్యారు. మహద్వారం వద్ద మహిళా సిబ్బంది ఆ ముగ్గురు భక్తులను అడ్డుకొని పాదరక్షలను విడిపించారు. ఈ విషయంపై వీడియో బయటకు వచ్చి వైరల్‌గా మారింది.
Tirumala News: ఈ నేపథ్యంలో పాదరక్షలతో ఆలయ వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా భక్తులు తెలరంగు కలిగిన చెప్పులు ధరించి దర్శనానికి వచ్చిన ఘటనపై టీటీడీ చర్యలు తీసుకున్నది. ఈ విషయంలో విఫలమైన సిబ్బందిని స్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నది. టీటీడీ ఈవో జే శ్యామలరావు ఆదేశాల మేరకు ఫుట్‌పాత్ హాలు, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేశారు. , ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని కోరుతూ ఎస్సీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదనలు పంపారు. ఇద్దరు టీటీడీ సిబ్బందిని, మరో ఐదుగురు సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేశారు. మరో 7గురు ఎస్పీఎఫ్ సిబ్బంది సస్పెన్షన్‌కు ప్రతిపాదనలు పంపారు.