Tirumala laddu:

Tirumala laddu: తిరుమ‌ల ల‌డ్డూకు య‌మ క్రేజీ.. నిరుడు రికార్డుస్థాయి విక్ర‌యం

Tirumala laddu: ప్ర‌పంచంలోనే తిరుమ‌ల ల‌డ్డూకూ విశేష ప్రాముఖ్య‌త ఉన్న‌ది. అత్యంత నాణ్య‌మైన దేవుడి ప్ర‌సాదంగా ఇప్ప‌టికే గుర్తింపు పొందింది. అలాంటి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ల‌డ్డూ ప్ర‌సాదం గ‌త ఏడాది అంటే 2025వ సంవ‌త్స‌రంలో మునుపెన్న‌డూ లేనంత‌గా అడ్డూల విక్ర‌యాలు జ‌రిగిన‌ట్టు టీటీడీ అధికారులు వెల్ల‌డించారు. అంత‌కు ముందు సంవ‌త్స‌ర‌మైన 2024 కంటే 2025వ సంవ‌త్స‌రంలో 10 శాతం అధికంగా ల‌డ్డూల విక్ర‌యాలు జ‌రిగిన‌ట్టు తెలిపారు.

Tirumala laddu: 2024లో తిరుమ‌లలో 12.15 కోట్ల ల‌డ్డూలు విక్ర‌యాలు జ‌రిగితే, అదే 2025వ సంవ‌త్స‌రంలో ఆ సంఖ్య 13.52 కోట్ల‌కు చేరింద‌ని టీటీడీ వెల్ల‌డించింది. అదే విధంగా గ‌త ద‌శాబ్ద‌కాలంలో ఎన్న‌డూ లేని విధంగా 2025 డిసెంబ‌ర్ 27వ తేదీన ఒక్క‌రోజే 5.13 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను భ‌క్తులు కొనుగోలు చేశార‌ని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. గ‌త ప‌ది సంవ‌త్స‌రాల‌లో ఇదే అత్య‌ధిక విక్ర‌యం కావ‌డం విశేషం

Tirumala laddu: టీటీడీ గ‌త ఏడాది కాలంగా ప్ర‌తిరోజూ నాలుగు ల‌క్ష‌ల వ‌ర‌కూ ల‌డ్డూల‌ను త‌యారు చేస్తున్న‌ది. ముఖ్య‌మైన రోజుల్లో 8 ల‌క్ష‌ల నుంచి 10 ల‌క్ష‌ల ల‌డ్డూల వ‌ర‌కు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతుంది. 700 మంది శ్రీ వైష్ణ‌వ బ్రాహ్మ‌ణులు శ్రీవారి పోటులో రెండు షిప్టుల్లో 24 గంట‌లు శ్ర‌మిస్తూ నియ‌మ‌, నిష్ఠ‌ల‌తో స్వామివారి ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను త‌యారు చేస్తున్నారు. ఇటీవ‌ల ల‌డ్డూల నాణ్య‌త‌, రుచి పెర‌గ‌డంతో భ‌క్తుల ఆద‌ర‌ణ పెరిగింద‌ని చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *