Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి ఓ విమానం వెళ్లింది. ఇది ఇప్పుడు భక్తుల మధ్య ఆందోళనకు కారణమవుతోంది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం దేవాలయాలపై విమానాలు ఎగరకూడదు. అయినప్పటికీ తరచూ ఆలయం పైనుంచి విమానాలు వెళ్లడంపై భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే అనేకసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని తిరుమల ఆలయాన్ని ‘నో ఫ్లైయింగ్ జోన్’గా ప్రకటించాలని కోరినా, ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదంటూ భక్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’ రెండో జాబితా.. కొత్తగా వీరికీ ఛాన్స్.. మీ పేరు ఉందో లేదో చెక్ చేస్కోండి

ఇదే సమయంలో తిరుమలలోకి ఉగ్రవాద ముప్పు ఉన్నట్లు గతంలో నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తిరుమలలో భద్రతను కూడా పెంచారు. అలాంటి సమయంలో ఆలయంపై విమానాలు తిరగడం భక్తుల్లో భయం, ఆగ్రహాన్ని పెంచుతోంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకొని ఆలయాన్ని పూర్తిగా నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *