Tihar Jail:

Tihar Jail: తీహార్ జైలును ఎందుకు త‌ర‌లిస్తున్న‌ట్టు? కార‌ణాలేమిటి?

Tihar Jail: ప్ర‌పంచంలోనే అతి పెద్ద కారాగారాల్లో ఒక‌టి, ద‌క్షిణ ఆసియాలోనే అతి పెద్ద కారాగారంగా గుర్తింపు పొందిన తీహార్ జైలును అక్కడి నుంచి మ‌రోచోటుకు త‌ర‌లించేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. దేశ రాజ‌ధాని న‌గ‌ర‌మైన ఢిల్లీలో ఉన్న ఆ జైలును సామ‌ర్థ్యం, స‌దుపాయాల దృష్ట్యా వేరే ప్రాంతానికి త‌ర‌లించాలని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఢిల్లీ ముఖ్య‌మంత్రి రేఖా గుప్తా వెల్ల‌డించారు.

Tihar Jail: వాస్త‌వంగా తీహారు జైలు సుమారు 10 వేల మంది ఖైదీల సామ‌ర్థ్యం ఉన్న‌ది. అయితే ప్ర‌స్తుతం 19వేల మంది ఖైదీలు ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశంగా మారింది. దీంతో ఇప్ప‌టికే ఖైదీల సామ‌ర్థ్యం మించిపోవ‌డం, భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు, మౌలిక స‌దుపాయాల లోటుపై ఈ నిర్ణ‌యానికి కార‌ణ‌మ‌ని ముఖ్య‌మంత్రి రేఖా గుప్తా తెలిపారు. దీంతో అధిక భారం వ‌ల్ల జైలు నిర్వ‌హ‌ణ‌, ఖైదీల ప‌రిస్థితుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతున్న‌ట్టు ప్ర‌భుత్వం గుర్తించింది.

Tihar Jail: ఆయా కార‌ణాల‌తో ఢిల్లీ న‌గ‌రానికి దూరంగా ఆత్యాధునిక స‌దుపాయాలు, భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌తో కూడిన నూత‌న జైలును నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిస్తున్నట్టు స‌మాచారం. అందులో ఉండే ఖైదీల హ్యూమ‌న్ రైట్స్‌, సుర‌క్షిత జీవ‌న ప‌రిస్థితులు, జైలు సిబ్బందికి అనుకూల వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ మార్పు చేప‌ట్ట‌నున్న‌ట్టు ఢిల్లీ స‌ర్కారు తెలిపింది. జైలు త‌ర‌లింపు నిర్ణ‌యం దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. సంస్క‌ర‌ణ‌ల దిశ‌గా కీల‌క అడుగుగా అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *