Lionel Messi

Lionel Messi: మెస్సీ మ్యాచుకు ఊహించని భద్రత.. ఉప్పల్‌లో డ్రోన్ నిఘా!

Lionel Messi: రేపు ఉప్పల్ స్టేడియంలో జరగబోయే అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌కి భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేశారు. ఈ మ్యాచ్‌లో ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ ఆడబోతున్నందున, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.

మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత, డ్రోన్లతో నిఘా
మెస్సీకి ఏకంగా ‘Z’ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. ఆయన్ని స్టేడియంకు గ్రీన్ ఛానెల్ ద్వారా తీసుకువస్తారు. అయితే, కారులో వస్తున్నప్పుడు కూడా మెస్సీని చూసే అవకాశం ప్రేక్షకులకు ఉండదు, కాబట్టి అనవసరంగా రోడ్డుపైకి వచ్చి చూసే ప్రయత్నం చేయవద్దని సీపీ విజ్ఞప్తి చేశారు.

భద్రత విషయంలో అధికారులు ఏ మాత్రం రాజీ పడడం లేదు. స్టేడియం చుట్టూ 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా, చాలా అధునాతనమైన డ్రోన్‌లు కూడా గగనతలం నుంచి నిఘా పెడతాయి.

పాస్‌లు ఉన్నవారికే అనుమతి, ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయం
స్టేడియం సామర్థ్యం 39 వేలు. నిర్వాహకులు దీనికి తగ్గట్టుగానే పాస్‌లు విక్రయిస్తున్నారు. అయితే, స్టేడియం దగ్గర ఎలాంటి పాస్‌లు అమ్మబడవు. కేవలం ఆన్‌లైన్ ద్వారా పాస్‌లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. పాస్‌లు లేనివారు దయచేసి స్టేడియం దగ్గరకు రావద్దని సీపీ స్పష్టం చేశారు.

మ్యాచ్ సమయం, ముందే రావాలి!
మ్యాచ్ రేపు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రేక్షకులను సాయంత్రం 4 గంటల నుంచే స్టేడియం లోపలికి అనుమతిస్తారు. మెస్సీ కేవలం కొద్దిసేపు మాత్రమే ఆడతారు కాబట్టి, అభిమానులు మ్యాచ్ సమయానికి ముందే స్టేడియంకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

లోపలికి అనుమతి లేని వస్తువులు
భద్రతా కారణాల వల్ల కొన్ని వస్తువులను స్టేడియం లోపలికి అనుమతించరు. అవి: ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, గొడుగులు, లైటర్లు, బైనాకులర్లు, బ్యాటరీలు, పదునైన వస్తువులు, హెల్మెట్, బ్యాగులు వంటివి. ప్రేక్షకులకు కేవలం మొబైల్ ఫోన్‌లను మాత్రమే తీసుకువెళ్లడానికి అనుమతి ఉందని సీపీ సుధీర్ బాబు తెలియజేశారు. అభిమానులు ఈ నిబంధనలను పాటించి, మ్యాచ్‌ను ఆస్వాదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *