Thug Life OTT: కమల్ హాసన్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘థగ్ లైఫ్’ సినిమా జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో శింబు, ఐశ్వర్య లక్ష్మి, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తూ, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మణిరత్నం మద్రాస్ టాకీస్, ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమా రూపొందింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. “థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత, అంటే ఆగస్టులో ‘థగ్ లైఫ్’ ఓటీటీలోకి వస్తుంది” అని స్పష్టం చేశారు. ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా ప్రియులకు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ థియేటర్, ఓటీటీలో అద్భుత అనుభవం అందించనుందని మేకర్స్ భావిస్తున్నారు.