Eluru: ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది. పందెం కోడికి ఈత నేర్పించడానికి పోలవరం కుడి కాలువలో దిగిన ఓకే కుటుంబానికి చెందిన తండ్రి, ఇద్దరు కుమారులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. శెట్టిపల్లి వెంకటేశ్వరరావు అతని కుమారులు శెట్టిపల్లి మణికంఠ, శెట్టిపల్లి సాయికుమార్ పోలవరం కుడి కాలువలో గల్లంతయ్యారు.
ఎలగైనా క్షేమంగా వాళ్ళు బయట పడాలని గ్రామస్తులు అంతా ఎదురుచూశారు. సమాచారం అందుకున్న పోలీస్ మరియు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించగా ముగ్గురు మృత దేహాలు లభ్యం అవ్వటంతో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.