Tamil Nadu

Tamil Nadu: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దారుణ హత్య

Tamil Nadu: తమిళనాడులోని ఓ కుటుంబంలోని ముగ్గురి హత్య ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కార్తీ మూవీ ‘‘ఖాకీ’’లాగే ఫామ్ హౌజ్‌లో ఈ హత్యలు జరిగాయి. చోరికి పాల్పడేందుకు వచ్చిన దొంగలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుప్పూర్‌లోని పొంగలూర్‌లో కుటుంబలోని ముగ్గురు దారణహత్యకు గురయ్యారు. దైవసిగమణి, అతని భార్యఅమలతల్, వారి కుమారుడు సెంథిత్ కుమార్ శుక్రవారం ఉదయం సేమలైకవుండంపళయంలోని వారి ఫామ్‌హౌజ్‌లో శవమై కనిపించారు.

కోయంబత్తూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సెంథిల్ కుమార్ ఓ పెళ్లికి హాజరయ్యేందుకు గురువారం తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. దైవసిగమణి ఇంటికి రోజూ వచ్చే మంగలి వ్యక్తి ఈ దారుణాన్ని మొదటిసారిగా చూడటంతో ఈ హత్యలు వెలుగులోకి వచ్చాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇంటి బయట తీవ్రంగా గాయపడిన దైవసిగమణిని గుర్తించి, ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను చికిత్స పొందుతూ మరణించాడు. అమలతల్, సెంథిల్ కుమార్‌లను ఇంట్లోనే నరికి హత్య చేశారు.

Tamil Nadu: ఘటనా స్థలాన్ని పరిశీలించిన తిరుప్పూర్ జిల్లా ఎస్పీ లక్ష్మి, ప్రాథమిక విచారణలో చోరీ జరిగినట్లు వెల్లడించారు. దాడిలో పదునైన, పెద్దవైన రెండు ఆయుధాలను వాడినట్లు, ఏడు సవర్ల బంగార ఆభరణాలు మాయమైనట్లు సమాచారం. మరోవైపు వ్యక్తిగత వివాదాల కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యలు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Terrorist: గవర్నమెంట్ టీచర్ టెర్రరిస్టులతో లింక్ పెట్టుకుండు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *