Maoists Encounter: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం అర్ధరాత్రి తరువాత రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని దేవిపట్నం మండలం కించకూరు – కాకవాడి గండి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేశారు. ఈ కాల్పుల్లో ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందారు.
మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య రావి వెంకట హరిచైతన్య అలియాస్ అరుణ, ఛత్తీస్‌గఢ్‌కి చెందిన మరో మహిళా మావోయిస్టు అంజు ఉన్నారు. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు మూడు ఏకే 47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
ప్రాంతం మొత్తం కోలాహలంగా మారింది
ఘటనా నేపథ్యంలో మారేడుమిల్లి, కొండమొదల్లు, చింతకూలు, కొయ్యలగూడెం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టులు ఇంకా అడవుల్లో ఉన్నారన్న నిఘా నేపథ్యంలో గ్రేహౌండ్స్ బలగాలు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: KTR: నేడు లండన్ పర్యటనకు కేటీఆర్
మృతుల వివరాలు
-
గాజర్ల రవి అలియాస్ ఉదయ్ – వరంగల్ జిల్లా వెలిశాల గ్రామానికి చెందినవాడు. మావోయిస్టు ఉద్యమంలో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తిగా పేరు పొందాడు.
-
అరుణ – మావోయిస్టు అగ్రనేత చలపతికి భార్య. అనకాపల్లి జిల్లా పెందుర్తికి చెందినవారు.
-
అంజు – ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళా మావోయిస్టు.
అధికారుల ప్రకటన
ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టు శక్తులపై బలమైన పంచ్ అని భద్రతా అధికారుల అభిప్రాయం. మావోయిస్టుల చట్టవిరుద్ధ కార్యకలాపాలను అణిచివేయడంలో ఇది కీలక ఘట్టమవుతుందని వారు పేర్కొన్నారు.