ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అరేబియాలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ ప్రభావంతో రాగల 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ తుఫాన్ల ప్రభావంతో అక్టోబర్ 10 తర్వాత కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు