Mumbai: సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ మెసేజ్..

Mumbai: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఫోన్ నెంబర్ నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి అధికారిక వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఉదయం ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ ద్వారా ఒక బెదిరింపు సందేశం అందింది.

ఈ సందేశంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పేల్చేస్తామని హెచ్చరించారు. ఈ మెసేజ్‌ను పంపిన వ్యక్తి తనను మాలిక్ షాబాజ్ హుమాయున్‌గా పేర్కొన్నాడు. ఈ బెదిరింపు నేపథ్యంలో సీఎం ఫడ్నవీస్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ప్రభుత్వ భవనాలు, కీలక ప్రదేశాల వద్ద భద్రతను పెంచారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *