Seebe Fruit

Seebe Fruit: సీబీ పండును తీసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్ గ్యారెంటీ..!

Seebe Fruit: చలికాలం రాకముందే పుష్కలంగా లభించే అత్యంత పోషక విలువలు కలిగిన పండు సీబీ పండు. దీనిని జామ పండు, పర్ల పండు, సీబీ పండు, జాము పండు అని కూడా అంటారు. ఒక సీబీ పండులో 10 యాపిల్స్‌లో ఉన్నంత పోషకాలు ఇందులో ఉంటాయి. అయితే ఈ పండు గురించి తెలియక తింటే అనారోగ్య సమస్యలు తప్పవు. లాభనష్టాలు ఏమిటో చూద్దాం.

Seebe Fruit: ఈ జామ పండును తీసుకోవడం వల్ల శరీరానికి, జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. దీని వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. కాబట్టి, అధిక ఉష్ణోగ్రత ఉన్నవారు ఈ పండును తినవచ్చు. ఈ సీబీ పండులో విటమిన్ సి కూడా సరిపోతుంది. ఇది మన శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్, పొటాషియం రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రక్తపోటును కూడా కొంతమేర తగ్గిస్తుంది. ఈ సీబీ పండును తీసుకోవడం వల్ల కంటి చూపు మరియు మెదడు పనితీరును మెరుగుపరచడంలో ప్రధానంగా సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: Ginger Tea Benefits: అల్లం టీతో లెక్కలేనన్ని ప్రయోజనాలు..

ఈ పండు ఎవరు తినకూడదు?

Seebe Fruit: జామ పండులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, గ్యాస్ ట్రబుల్ వంటివి వస్తాయి. ఇది ఉబ్బరం కలిగిస్తుంది. జామ పండులో గట్టి గింజలు ఉంటాయి కాబట్టి, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. తరచుగా జలుబుతో బాధపడేవారు  ఈ పండును ఎక్కువగా తీసుకోకుండా మితంగా రెండు జామ పండ్లను తింటే ఇబ్బంది ఉండదు.  ఈ జామ పండులో ఉప్పు, కొద్దిగా లవణం కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. జామ పండు తింటే బోరింగ్‌గా అనిపించే వారు ఇతర పండ్లు, కూరగాయలతో కలిపి సలాడ్‌గా తినవచ్చు. మన నోటిలో జామ పండు లేదా గింజ తినలేని వారు జ్యూస్ చేసి తాగవచ్చు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *