PAK vs AUS: స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ సెలక్టర్లు ప్రకటించారు. 13 మంది సభ్యుల ఈ జట్టుకు కెప్టెన్‌ను ఎంపిక చేయలేదు. త్వరలో కెప్టెన్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఆసీస్ జట్టులో సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా ఎంపికయ్యారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దృష్ట్యా టెస్ట్ జట్టు సభ్యులను పాక్‌తో సిరీస్ ఎంపిక చేయలేదు. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ సైతం ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.
