Suryakumar Yadav: ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్ తర్వాత, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను ఇకపై ప్రత్యర్థిత్వం కాదని అభివర్ణించారు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత, సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మీరు ఇండియా-పాకిస్థాన్ ప్రత్యర్థ్యం గురించి ప్రశ్నలు అడగడం ఆపాలి. నా అభిప్రాయం ప్రకారం, రెండు జట్లు 15-20 మ్యాచ్‌లు ఆడి, స్కోర్‌లైన్ 7-7 లేదా 8-7 ఉంటే, అది ప్రత్యర్థ్యం అవుతుంది. 10-0, 10-1 (టీ20ల్లో భారత్ పాకిస్థాన్ పై గెలిచిన రికార్డు) ఉన్నప్పుడు, ఇది ఇకపై ప్రత్యర్థ్యం కాదు.
ఇది కూడా చదవండి: Abhishek Sharma: గురువు రికార్డు బద్దలు కొట్టిన శిష్యుడు
మేము వారికంటే మెరుగైన క్రికెట్ ఆడాము, బౌలింగ్ పరంగా కూడా అని పేర్కొన్నారు. ఆసియా కప్ టీ20ఐ ఫార్మాట్‌లో, పాకిస్థాన్‌తో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో భారత్ నాలుగు విజయాలు సాధించింది, టీ20ఐలలో, ఇప్పటివరకు ఆడిన 15 మ్యాచ్‌ల్లో భారత్ 12 విజయాలు సాధించింది. ఐసిసి పురుషుల వన్డే ప్రపంచ కప్‌లో, పాకిస్తాన్‌తో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిచింది, టి20 ప్రపంచ కప్‌లో కూడా, మెన్ ఇన్ గ్రీన్‌తో జరిగిన 8 మ్యాచ్‌ల్లో భారత్ 7 గెలిచింది. ఇక నిన్న జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో అభిషేక్ 39 బంతుల్లో 74 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్న సమయంలో, పంజాబ్‌కు చెందిన 25 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ఇక 28 బంతుల్లో 47 పరుగులు చేసిన శుభ్‌మాన్ గిల్‌తో కలిసి మొదటి వికెట్‌కు 9.5 ఓవర్లలో 105 పరుగులు జోడించాడు.