Sunscreen Lotion: వేసవి వచ్చిందంటే ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా చర్మం గురించి కూడా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మండే ఎండల కారణంగా చర్మం త్వరగా టాన్ అవుతుంది. అది పొడిగా, కాలిపోయినట్లుగా ఉంటుంది. అందుకే చాలా మంది సన్‌స్క్రీన్ లోషన్లు వాడతారు. ఈ సన్‌స్క్రీన్ చర్మాన్ని సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ సన్‌స్క్రీన్ లోషన్‌ను అప్లై చేయడం చాలా అవసరం. అయితే ఈ క్రీమ్‌లో చాలా రసాయన పదార్థాలు వాడతారు. దీనివల్ల చర్మానికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి చర్మ రకాన్ని బట్టి ఏ రకమైన సన్‌స్క్రీన్ ఉపయోగించాలి? ఏ ఏ అంశాలు చూసి కొనాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సన్‌స్క్రీన్ కొనేటప్పుడు దీనిపై శ్రద్ధ వహించండి :
సన్‌స్క్రీన్ క్రీములను కొనుగోలు చేసేటప్పుడు..ముందుగా వాటిపై ఉన్న SPF రేటింగ్‌ను చూడాలి. ఇది UVA, UVB నుండి రక్షిస్తుందని నిర్ధారించుకోవాలి. కనీసం SPF 15 ఉన్న సన్‌స్క్రీన్‌ను కొనాలి. చర్మం పొడిగా, దురదగా ఉంటే లోషన్ వాడటం మంచిది. సాధారణ చర్మం ఉంటే క్రీమ్ ఉపయోగించవచ్చు. మీకు మొటిమల సమస్యలు ఉంటే జెల్ వాడటం మంచిది.సన్‌స్క్రీన్ కొనుగోలు చేసి ఉపయోగించేటప్పుడు, మీ చేతికి లేదా మరేదైనా ప్యాచ్ టెస్ట్ చేయడం మర్చిపోవద్దు.
Also Read: Sweets: స్వీట్ తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
మీరు ఎంత తరచుగా సన్‌స్క్రీన్ అప్లై చేయాలి?
UV కిరణాలు అన్ని సీజన్లలో ఉంటాయి. కాబట్టి అన్ని సమయాల్లో సన్‌స్క్రీన్ ఉపయోగించడం ముఖ్యం. మీకు చెమట పట్టడం లేదా చర్మాన్ని రుద్దడం అలవాటు ఉంటే ప్రతి రెండు గంటలకు ఒకసారి క్రీమ్ రాయాలి. ఎండలో బయటకు వెళ్ళడానికి 20 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోవద్దు. ఇది చర్మాన్ని నాలుగు గంటలు మాత్రమే రక్షిస్తుంది.. సన్ టానింగ్‌ను నివారిస్తుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.