ap news: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టీడీపీ తన అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు వారి పేర్లను ఆ పార్టీ అధిష్ఠానం వెల్లడించింది. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, తూర్పు-పశ్చిమ గోదావరి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పేర్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు విడుదల చేశారు.
ap news: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలి, రాజశేఖర్ కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానాలను ఆశించగా, ఆ రెండు స్థానాలు కూటమి పొత్తులో భాగంగా జనసేట పార్టీకి వెళ్లాయి. దీంతో వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కింది.