Most Wanted Terrorists: మన దేశంలో బ్లాస్టింగ్స్, కాల్పులు జరిపి వందలాది మంది అమాయక పౌరుల, పోలీస్, భద్రతా బలగాల ప్రాణాలు తీసిన ఎంతో మందిని భారత ప్రభుత్వం మోస్టడ్ వాంటెడ్ టెర్రరిస్టులుగా గుర్తించింది. వారి కోసం ఎన్ఐఏ సహా భారత ప్రభుత్వం వేట కొనసాగిస్తున్నది. వాళ్లు ఎవరు? దేశంలో ఎలాంటి దురాగతాలకు పాల్పడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం..
1. హాఫిజ్ సయీద్:
వీడు లష్కర్-ఎ-తోయిబా వ్యవస్థాపకుడు. ముంబైలోని తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ వంటి ప్రదేశాల్లో జరిగిన దాడులకు వీడే మాస్టర్‌మైండ్.166 మంది ప్రాణాలు కోల్పోడానికి, 300 మందికి పైగా గాయపడడానికి హఫీజ్ సయీదే కారకుడు. అంతేకాదు జమ్మూ కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, యువతను ఉగ్రవాదంలోకి రిక్రూట్ చేయడం వీడి పని. ఇటీవలి పహల్గాం దాడి వెనుక కూడా హాఫిజ్ హస్తమే ఉందని ఎన్ఐఏ గుర్తించింది. వీడు ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఐక్యరాష్ట్ర సమితి ద్వారా గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించబడ్డాడు.
2. మౌలానా మసూద్ అజర్
వీడు జైషే –మొహమ్మద్ వ్యవస్థాపకుడు. 2001 భారత పార్లమెంట్ దాడి సూత్రధారి. ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంట్ లోకి చొరబడి 9 మందిని చంపారు. ఈ దురాగతానికి కారకుడు వీడే. జమ్మూ కాశ్మీర్‌లో సీఆర్ పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించారు. ఈ దాడి వెనుక ఉన్నది కూడా మసూద్ అజరేనని ఎన్ఐఏ గుర్తించింది. భారత్‌లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం వీడి పని. వీడు కూడా పాకిస్తాన్ లో ఉంటూ భారత్ లో టెర్రరిస్టు యాక్టివిటీస్ కు పాల్పడుతున్నాడు.
3. హషిమ్ మూసా
వీడు లష్కరే -తోయిబాకు చెందిన టెర్రరిస్టు. మూసా పాకిస్తాన్ మాజీ పారా కమాండోగా గుర్తించబడ్డాడు. పహల్గామ్ దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ దాడిలో వీడు కూడా ఉన్నాడని, లష్కరే తోయిబాతో కలిసి కశ్మీర్‌లో వీడు ఈ ఉగ్ర దాడి నిర్వహించినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీడు పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి ఉగ్రసంస్థ అయిన లష్కరే తోయిబాలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం వీడు పాకిస్తాన్‌లోని ముజఫరాబాద్‌లోని సేఫ్ హౌస్‌లో ఉన్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తున్నది.
4. సైఫుల్లా కసూరి(ఖాళిద్)
వీడు లష్కరే -తోయిబా టాప్ కమాండర్. 2025 పహల్గాం దాడిలో వీడు కూడా ఉన్నాడు. ఈ దాడికి మాస్టర్‌మైండ్‌గా గుర్తించబడ్డాడు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు AK 47, M4 రైఫిల్స్‌తో పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ నలుగురు ఉగ్రవాదులకు ఆదేశాలు ఇస్తూ.. ఈ దాడికి మొత్తం ప్లాన్ చేసింది సైఫుల్లా కసూరేనని ఎన్ఐఏ గుర్తించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఈ దాడిని ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి. ప్రస్తుతం వీడు కూడా పాకిస్తాన్‌లో ఉన్నట్లు ఎన్ఐఏ భావిస్తున్నది.
Also Read: Crime News: హైదరాబాద్‌లో మరో భూవివాదం.. కత్తులు, రాళ్లతో పరస్పర దాడులు.. నలుగురికి గాయాలు
5. అబ్దుల్ రెహమాన్ మక్కీ
వీడు లష్కరే -తోయిబా టెర్రరిస్టు. లష్కర్-ఎ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ బామ్మర్ది. 2008 ముంబై దాడులు సహా భారత్‌లో అనేక ఉగ్రవాద దాడుల్లో వీడి హస్తం ఉన్నది. భారత్‌లో యువతను రిక్రూట్ చేయడం, నిధులు సమకూర్చడం. ఎన్ఐఏ వీడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించగా.. ఐక్యరాష్ట్ర సమితి కూడా గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. వీడి కోసం కూడా భారత్ వెతుకుతోంది.
6. అసీఫ్ ఫౌజీ
వీడు కూడా లష్కరే -తోయిబా టెర్రరిస్టు. ఇటీవలి పహల్గాం దాడికి నాయకత్వం వహించింది వీడేనని ఎన్ఐఏ గుర్తించింది. వీడికో ప్రత్యేకత ఉన్నది. అసీఫ్ పుట్టింది జమ్మూ కాశ్మీర్ లోనే అయినా.. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అసీఫ్ పాక్ ఆర్మీతో కలిసి పనిచేసినందున “ఫౌజీ” అనే పేరు వచ్చింది. పహల్గాం దాడిలో పర్యాటకులపై కాల్పులు జరిపిన నలుగురు ఉగ్రవాదుల్లో అసీఫ్ ఒకడిగా ఉన్నట్లు ఊహాచిత్రాలు విడుదలయ్యాయి.
7. అబ్దుల్ రవూఫ్ అస్గర్, సాజిద్ మీర్, షాహిద్ మహమూద్, తల్హా సయీద్ వీరంతా.. లష్కరే -తోయిబా, జైషే-మొహమ్మద్ ఉగ్రసంస్థలకు చెందిన ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదులు భారత్‌లో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారు. వీటిలో 26/11 ముంబై దాడులు, ఇతర చిన్న దాడులు ఉన్నాయి. వీరంతా వ్యక్తులు భారత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌లను నిర్వహించడం, ఆయుధాలు సరఫరా చేయడం, దాడులకు పథకాలు రూపొందించడంలో పాల్గొన్నారు.