Hyderabad: తెలంగాణలో రేపు, 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. టీజీపీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 1,368 పరీక్షా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించబోతున్నాయి. 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదలైంది, కానీ అనేక కారణాల వల్ల ఈ పరీక్షలు వాయిదా పడిన తర్వాత, ఇప్పుడు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్, పాస్‌పోర్టు సైజు ఫోటో, ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకురావాలని సూచించారు. మహిళా అభ్యర్థులు మంగళసూత్రం, గాజుల వరకే అనుమతించారు. ఇతర ఆభరణాలు ఉండకుండా రావాలని స్పష్టం చేశారు. అలాగే, అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరిస్తూ, బెల్ట్‌లు, రిమోట్ కీలు తీసుకురావద్దని సూచించారు
.