Kuberaa: సరదాగా సినిమా చూద్దామని థియేటర్ కు వెళ్లిన అభిమానులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. కుబేర సినిమా చూస్తుండగా థియేటర్ సీలింగ్ ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ అనూహ్య ప్రమాదం మహబూబాబాద్‌లోని ముకుందా థియేటర్‌లో చోటు చేసుకుంది. అయితే నిన్న రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెకండ్ షో చూస్తుండగా ఒక్కసారిగా ప్రేక్షకుల మీద ఊడి సీలింగ్ పైకప్పు నేరుగా ప్రేక్షకులపై పడటంతో పలువురికి తలలకు గాయాలు అయ్యాయి. అయితే పలచటి పీవోపీ షీట్లతో సీలింగ్ ఉండటంతో.. ప్రేక్షకులకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం అనంతరం థియేటర్ యాజమాన్యం నిర్లక్యంపై నిరసిస్తూ.. గాయాలు అయిన వారితో పాటు మిగిలిన ప్రేక్షకులు గొడవకు దిగారు. ప్రేక్షకులు భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన థియేటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.
