Veeramallu

Veeramallu: ‘వీరమల్లు’ మూడో సాంగ్ వచ్చేస్తోంది!

Veeramallu: పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా దర్శకుడు జ్యోతి కృష్ణ రూపొందిస్తున్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాపై ఆరంభంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ అనేకసార్లు వాయిదా పడుతూ వస్తుండటంతో ఆ హైప్ కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. తాజాగా, ఈ చిత్రం రిలీజ్ మార్చి నుంచి మే నెలకు షిఫ్ట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Also Read: Jana Nayagan: భారీ ధరకి ‘జన నాయగన్’ ఓటిటి రైట్స్!

Veeramallu: ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ సినిమా మూడో సాంగ్ గురించి లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం, ఈ ఏప్రిల్ 10న మూడో పాట రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. ఇక, వచ్చే మే 9న పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మరి, ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *