Nanna Harana song: రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదలైంది. తొలి రోజు నుండే డివైడ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమాలో ఓ పాటను మేకర్స్ మొదటి రోజున సినిమాతో పాటు ప్రదర్శించలేదు. టెక్నికల్ సమస్య కారణంగా ‘నానా హైరానా’ అనే పాటను పెట్టలేకపోయామని, 14 నుండి దానిని యాడ్ చేస్తామని తెలిపారు. నిజానికి ‘గేమ్ ఛేంజర్’ మూవీలో ‘నా నా హైరానా’ పాటే అత్యధికంగా వ్యూస్ దక్కించుకుంది. దాంతో ఆదివారం నుండి ఈ పాటను ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ జత చేశారు. ఇన్ ఫ్రా రెడ్ కెమెరాతో చిత్రీకరించి ఈ పాట ఐ ఫీస్ట్ గా ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే… ఇందులో అప్పన్నగా నటించిన రామ్ చరణ్, అతని భార్య అంజలి మీద చిత్రీకరించిన ‘అరుగు మీద’ సాంగ్ ప్రోమో కూడా విడుదలైంది.
