Tourists Entry Fee: సిక్కిం ప్రభుత్వం పర్యాటకుల నుండి ₹50 ఎంట్రీ ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. సిక్కిం పర్యాటక వాణిజ్య నమోదు నియమాలు 2025 ప్రకారం ఈ ఫీజు ఈ నెల నుండి అమలు చేయిస్తున్నారు. ఈ ఫీజు హోటళ్లలో చెక్-ఇన్ సమయంలో వసూలు చేస్తారు. పర్యాటక సస్టైనబిలిటీ డెవలప్‌మెంట్ (TSD) ఫండ్ లో దీనిని ఉంచుతారు. ఇది పర్యాటక మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది.
Also Read: Kajol: కార్ పార్కింగ్ కోసం 28.78 కోట్లు ఖర్చు పెట్టిన కాజోల్!
Tourists Entry Fee: 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ రుసుము నుండి మినహాయింపు ఉంది. సిక్కింలో 30 రోజులు బస చేసే ప్రతి పర్యాటకుడు ఈ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక నెల తర్వాత మళ్ళీ వస్తే మళ్ళీ ఫీజు వసూలు చేస్తారు.
ప్రభుత్వం ఈ ఆదాయాన్ని రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడానికి, పరిశుభ్రతను మెరుగుపరచడానికి, మెరుగైన పర్యాటక అనుభవాన్ని అందించడానికి పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తుంది.