KillR: ’శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్’’ తో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు పూర్వాజ్. ఇప్పుడు పూర్వాజ్ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’ను తెరకెక్కితున్నాడు. ఇందులో అనే హీరోగా కాగా జ్యోతి పూర్వాజ్ హీరోయిన్. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. దీనిని పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి భాగం మూడో షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. దీనితో యాభై శాతం షూటింగ్ కంప్లిట్ అయ్యిందని పూర్వాజ్ చెప్పారు. తాజా షెడ్యూలో ప్రధాన తారాగణం పాల్గొనగా, యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లింగ్ సీన్స్ తీశామని, లవ్, రొమాన్స్, రివేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలు అందులో మిళితమై ఉన్నాయని అన్నారు. మరి ‘శుక్ర, మాటరాని మౌనమిది’ తరహాలో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.
