Telangana News: తెలంగాణ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో విషాదకర ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, అనాసాగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఒకరు మరణించారు.
అనాసాగర్ సర్పంచ్ స్థానం కోసం దామాల నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే, ఎన్నికల ప్రచారంలో పడిన ఒత్తిడి కారణంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే అతడిని చికిత్స కోసం శనివారం సాయంత్రం ఆసుపత్రిలో చేర్చారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే, దురదృష్టవశాత్తూ ఆదివారం తెల్లవారుజామున దామాల నాగరాజు మరణించారు. ఎన్నికల ప్రచార ఒత్తిడి కారణంగానే ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న అభ్యర్థి హఠాన్మరణం చెందడంతో అనాసాగర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

