Sonu Sood

Sonu Sood: సోనూసూద్ సేవా దృక్పథం: వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ఏం చేశాడో తెలుసా?

Sonu Sood: టాలీవుడ్‌లో విలన్‌గా మెరిసిన సోనూసూద్, నిజ జీవితంలో మాత్రం ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలిచారు. పంజాబ్‌లో ఇటీవల సంభవించిన వరదల వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలవడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగారు.

భారీ వర్షాల కారణంగా పంజాబ్‌లోని దాదాపు 1998 గ్రామాలు నీటమునిగాయి. ఈ వరదల్లో 48 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 1.45 లక్షల మంది ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ప్రజలకు భారీగా ఆస్తి, పంట నష్టం సంభవించింది. ప్రభుత్వం, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ, సోనూసూద్ వంటి సెలబ్రిటీలు కూడా తమవంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

సోనూసూద్ సేవ :
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సహాయం చేసి ‘రియల్ హీరో’గా పేరు తెచ్చుకున్న సోనూసూద్, ఇప్పుడు పంజాబ్ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. అమృత్‌సర్‌తో పాటు, బాఘ్‌పూర్, సుల్తాన్‌పూర్ లోధి, ఫిరోజ్‌పూర్ వంటి ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వరదల్లో ఇళ్లు కోల్పోయిన నిరాశ్రయులను చూసి చలించిపోయిన సోనూసూద్, వారందరికీ కొత్త ఇళ్లను కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఈ సహాయం కేవలం కొన్ని రోజుల్లో పూర్తయ్యే పని కాదని, పంజాబ్ కోలుకోవడానికి నెలల సమయం పడుతుందని ఆయన తెలిపారు.

Also Read: Japan: ప్రధాని పదవికి రాజీనామా చేయనున్న ఇషిబా!

సోనూసూద్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు, నెటిజన్లు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘సోనూసూద్ లాంటి మంచి మనసున్న మనుషులు దేశానికి ఎంతో అవసరం’ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. స్వయంగా వరదల్లోని ప్రమాదకర పరిస్థితులను లెక్క చేయకుండా ప్రజలను పరామర్శించిన సోనూసూద్ దాతృత్వం అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో కరోనా సమయంలో కూడా తన అవసరం ఉన్న చోటికి నేరుగా వెళ్లి సహాయం చేసిన ఆయన, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో పంజాబ్ ప్రజలకు ఆసరాగా నిలిచారు.

ALSO READ  NADENDLA MANOHAR: సీఏ అవుదామనుకున్నా కానీ మంత్రిని అయ్యా..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *