The Raja Saab Trailer: బాహుబలి తర్వాత వరుసగా భారీ చిత్రాలు చేస్తూ వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఇప్పుడు యువ దర్శకుడు మారుతితో కలిసి పూర్తి వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా రిలీజైన ది రాజాసాబ్ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు ‘ది రాజాసాబ్’ (The Raja Saab) అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది ప్రభాస్ కెరీర్‌లోనే మొదటి రొమాంటిక్ హారర్ ఫాంటసీ కామెడీ మూవీ కావడం విశేషం.
అంచనాలను పెంచిన ట్రైలర్
ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, దసరా పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా ‘ది రాజాసాబ్’ ట్రైలర్‌ను విడుదల చేసింది. మూడు నిమిషాల 34 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా అంచనాలకు మించి ఉండేలా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
దర్శకుడు మారుతి, ప్రభాస్‌లోని పూర్తి వినోదాత్మక కోణాన్ని ఈ సినిమా ద్వారా బయటకు తీసుకువస్తున్నారని ట్రైలర్ స్పష్టం చేసింది. ప్రభాస్ కొత్త లుక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు అద్భుత స్పందన వచ్చింది. భారీ అంచనాలున్న ఈ చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.