The Raja Saab

The Raja Saab: ‘ది రాజా సాబ్’ రిలీజ్.. ఆరోజే క్లారిటీ?

The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ది రాజా సాబ్”. అయితే అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికే ఈ సినిమా సాలిడ్ ప్రమోషన్స్ లో ఉండి ఉండేది. కానీ రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక కొత్త డేట్ ఏంటి? ఎప్పుడు?అనే దానిపై లేటెస్ట్ గా ఓ సమాచారం వినిపిస్తోంది.ఈ సమాచారం ప్రకారం ఈ ఉగాదికి లేదా ఏప్రిల్ లో ఇంట్రెస్టింగ్ టీజర్ తో ఆ డేట్ ని మేకర్స్ రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ సినిమా ట్రీట్ కోసం చూస్తున్న వారికి అప్పుడు ఒక క్లారిటీ రానుందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘కల్కి 2898 ఏడి’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ‘ది రాజా సాబ్’ అందుకుంటుందో లేదో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vikram Vedha Makers: శివకార్తికేయన్‌తో విక్రమ్ వేద మేకర్స్ భారీ ప్రాజెక్ట్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *